ఒఎన్జిసి హెలికాఫ్టర్ క్రాష్

Posted on : 13/01/2018 03:46:00 pm

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఒఎన్జిసి) ఉద్యోగులు 5 గురు, మరో ఇద్దరు పైలెట్స్ కలిపి మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ముంబయికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) తో సంబంధం కోల్పోయింది. పవన్ హన్స్ హెలికాప్టర్లోని శిథిలాలు శనివారం ఉదయం బయటపడ్డాయి. నాలుగు మృతదేహాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.పెద్ద ఎత్తున ఇండియన్ కోస్ట్ గార్డ్ (ISG) సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. జ్యూ ఎయిర్ ఏరోడ్రోం నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ VT-PWA కు చెందిన ఛాపర్ డౌఫిన్ N3, 5గురు ONGC ఉద్యోగులు మరియు ఇద్దరు పైలట్లతో ప్రయాణిస్తున్నారు తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు ముంబై హై వద్ద ఈ హెలికాఫ్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది, కానీ అనుకోని సంఘటనల వల్ల హెలికాఫ్టర్ ముంబై తీరంలో కూలిపోయినట్టు తెలుస్తుంది. ప్రమాదానికి సంబందించిన కారణాలు ఇంకా బయటకి రాలేదు.