వీడు సుడిగాడు అంటే, 20 ఏళ్ల వయసుకే కోటీశ్వరుడు

Posted on : 13/01/2018 05:09:00 pm

     ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.2800 కోట్ల లాటరి గెలుచుకున్నాడు 20 ఏళ్ళ షేన్ మిస్లర్, దీంతో 20 ఏళ్లకే కోటీశ్వరుడు అయిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ఫ్లోరిడాకి చెందిన షేన్ మిస్లర్ జనవరి 5న తాను కొన్న లాటరి టికెట్ $451 మిలియన్స్ ( రూ.2800 కోట్లు భారత కరెన్సీలో ) లక్కీ డ్రా లో గెలుపొందింది, దీంతో అతను ఈ మొత్తాన్ని  శుక్రవారం తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని విడతలుగా తీసుకోవడానికి అతను నిరాకరించాడు అని టంపా బే టైమ్స్ అనే పత్రిక తెలిపింది. ఒక్కసారిగా $ 281 మిలియన్స్ తీస్కోవడానికి తాను అంగీకరించాడు అని తెలుస్తుంది. తాను సంపాదించినా డబ్బును సవ్యంగా ఉపయోగిస్తాను అని అన్నాడు.
      తనకు 20 సంవత్సరాలు మాత్రమే అని, తనకి వచ్చిన డబ్బులతో అతని కోర్కెలు తీర్చుకుని, తన కుటుంబానికి అవి ఉపయోగపడేలా చేస్తాను అని, సాటి మనుషుల కోసం కొంత ఖర్చుపెడతా అని  అతను లాటరీ వారితో అన్నట్టు తెలుస్తుంది. వారం క్రితం న్యూ హాంప్షెర్ కి చెందిన ఇంకో వ్యక్తి $ 560 మిలియన్ డాలర్స్ గెలిచినట్టు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి వీడిని సుడిగాడు అని కాకుండా ఇంకా ఏమని అంటాము.