ట్రంప్ దగ్గర పనిచేయడం నావల్ల కాదు

Posted on : 13/01/2018 07:03:00 pm

     ట్రంప్ పరిపాలనను వ్యతిరేకిస్తూ పనామాకి అమెరికా రాయబారిగా పని చేస్తున్న జాన్ డి ఫీలే తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా ప్రభుత్వం దీనిని ధ్రువీకరించింది.
ట్రంప్ విధానాలతో తాను ఏకీభవించలేకపోతున్నాను అని, జూనియర్ విదేశీ సేవా అధికారిగా తన కర్తవ్యాలను నిర్వర్తించలేకపోతున్నాను అని అయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఫేలే స్టేట్ డిపార్టుమెంటు లోని లాటిన్ అమెరికా నిపుణులలో ఒకరు, అంతే కాకుండా ఆ డిపార్ట్మెంట్ యొక్క సీనియర్ అధికారి.
    ట్రంప్ ఇటీవల ఆఫ్రికా, హైటి దేశాల వలసదారులు ఉద్దేశించి అతి చెత్త(షిట్‌ హోల్‌) దేశాలనుంచి ఇమ్మిగ్రెంట్స్‌ అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే, (దాని గురించి ఇక్కడ చదవండి) . తాను నమ్మిందే తాను చేస్తానని, ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేయడం వాళ్ళ తనకు గర్వంగా వుంది అని అయన అన్నారు.