వాస్తులో కుల బీజాలు !!!

Posted on : 14/01/2018 12:36:00 am

హిందూ సమాజం లో లోతుగా వేల్లూరుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో కనబడతాయి. గ్రామా /పట్టణ/ నగరాల లో ఏ వర్గం (కులం/వర్ణం) ఏ దిశలో ఉండాలో చెప్ప బడింది.వృత్తులను బట్టి,జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది. దీనివల్ల తరతరాలగా సమాజం వర్గాలుగా ,కులాలగా విభజింప బడినది.వృత్తుల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్నిశాశ్వితం చేసాయి.వాస్తు శాస్త్రం లో చెప్పబడిన విషయాలను పరిసిలించితే నేటి కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు ఎలా వుండాలో,నేలకు రంగు, రుచి,వాసన, ఎలా వుండాలో చెప్పబడినది.
౧. బ్రాహ్మణలు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి
౨. క్షత్రియ : తూర్పుదిశలో ఇల్లు/ వాకిలి
౩. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి
౪. శూద్ర : పడమరదిశలో ఇల్లు/ వాకిలి 
ఈ దిశలు ఊరి మధ్య బిందువు (బొడ్డురాయి) కి వుంటాయి.
వీరితో పాటు మిగిలిన ఇతర వర్ణాలు,కులాలు ఎక్కడ నివాసం వుండాలో చెప్పబడినది. గ్రామ,నగరాలలోఆగ్నేయ,నైరుతి, వాయువ్య దిశలలో - చాకలి,మంగలి,జాలరి,మాదిగ, వర్ణ సంకరం చెందిన వారు నివాసం వుండాలి.
ఇంకా సంఘ బహిష్కరణ పొందిన వారు కూడా జనావాసాలలో "మూలల్లో" నివాసం వుండాలనిఆదేశించారు.అందుకేనేమో మూలల్లో నివసించే వారిని మూలవాసులు అన్నారు. వారినే నేడు " మాలలు " గా పిలుస్తున్నారు.
ఆనాటి ఈ పద్దతులు అన్ని తు.చ. తప్పకుండా అమలు జరిగేవన్నదానికి నిదర్శనగా ఆయా వర్గాలు వారికి కేటాయించిన ప్రదేశాలలో ఈ నాటికి నివశించుతూ ఉండటం గమనార్హం.
మాల, మాదిగ వాడలు,చాకలి,కుమ్మరి పాలెంలు,బ్రాహ్మణ,కోమట్ల బజారులు దీనికి సజీవ సాక్షంగానిలిచి ఉన్నాయి.
వాస్తును విశ్వసించే వారు వాస్తులో చెప్పబడిన ఈ కుల విభజనను అంగికరిస్తారా?
నేలరంగు, రుచి, వాసన,వాలు చూసి నివాసం ఉంటారా?
వీటిని అనుసరించి వారి ఇల్లు /వాకిలి ఏర్పరుచుకుంటారా?
ఆలోచించండి!!!