వరంగల్ పిల్లనే...అర్జున్ రెడ్డి

Posted on : 14/01/2018 12:46:00 am

మలబార్ గోల్డ్, డైమండ్ షోరూం ప్రారంభానికి వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఫేం విజయ్ దేవరకొండ శుక్రవారం  హన్మకొండలోని నక్కలగుట్టలో సందడి చేశాడు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ… ‘మా అన్న వరంగల్ అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు..  నేను కూడా వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను..’ అని అన్నాడు. అప్పుడప్పుడు సినిమా డైలాగ్స్‌ను చెప్పి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ‘నేను రాజకీయాల్లో వస్తే ఓటేస్తారా?‘ అని అతడు అడగ్గా.. జనం చప్పట్లు కొట్టారు.  

తమ అభిమాన నటుడిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. విజయ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్, వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్, మలబార్ గోల్డ్ ఎండీ అషర్, రీజినల్ హెడ్ సిరాజ్ పాల్గొన్నారు. తర్వాత విజయ్ హన్మకొండ రాంనగర్‌లోని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు.