మరోసారి సుకుమార్ తో మహేష్

Posted on : 14/01/2018 04:08:00 pm

         క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబు కంబినేషన్లో 2014 లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్, డైరెక్టర్ సుకుమార్ లు ఇద్దరికీ మంచి పేరు తెచ్చింది అనే చెప్పాలి. సూపర్ స్టార్ ని ఇంకా సూపర్ గా రాక్స్టార్ రోల్ లో చూపించాడు సుకుమార్. చిత్రం బాగా క్లాస్ గా ఉండటంతో బి,సి సెంటర్స్ లో ఆడలేదు.
       సాధారణంగా తనకి ప్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్స్ తో మహేష్ చేయడు కానీ, మహేష్ తో మరి చిత్రం తీసి హిట్ కొడతా అని చెప్పిన సుకుమార్ దీనికి సంబంధించి ఒక కథను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మహేష్‌కు ఓ లైన్ వినిపించి ఓకె చేయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్‌ సుకుమార్, రామ్ చరణ్‌ హీరోగా రంగస్థలం అనే చిత్రం రూపొందుతుంది, ఇప్పటికే చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత సుకుమార్ మహేష్ తో చేయబోయే చిత్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో భారత్ అనే నేను అనే పొలిటికల్ డ్రామాలో వర్క్ చేస్తున్నారు, ఈ చిత్రంతో తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మహేష్ సుకుమార్ ల సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.