టీజర్ టాక్ : ఎమ్మెల్యే (MLA)

Posted on : 14/01/2018 10:30:00 pm

     నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన ఎమ్మెల్యే ‌(మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్ర టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తో చేస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్నట్లు టీజర్ చుస్తే అర్ధం అవుతుంది. మణిశర్మ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉంది.
     టీజర్ లో థర్టీ ఇయర్స్‌ పృథ్వీ రిక్షా బండి లో కళ్యాణ్ రామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు..మనందరి ఆశాజ్యోతి..ఆంధ్రజ్యోతి.. ఈనాడు..సాక్షి..నమస్తే తెలంగాణా అంటూ ఈ టీజర్ మొదలవుతుంది. టీజర్ లో కథగురించి ఎక్కువ డిటైల్ గా వెళ్లకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. టీజర్ లో చూపించిన రెండు సన్నివేశాలు ఆకట్టుకునేలావున్నాయి. ఇది పక్కా  కామెడీ అండ్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా టీజర్ చుస్తే అర్ధం అవుతుంది