మీసం తీసేసిన సైరా నరసింహారెడ్డి!

Posted on : 15/01/2018 11:45:00 pm

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆయన 151 చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలయింది, ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలు కానుంది. మొదట రెండో షెడ్యూల్ ను రాజస్థాన్ లేదా పొలాచ్చిలో జరపాలని ఈ చిత్ర బృందం అనుకుంది, కానీ తాజా సమాచారం ప్రకారం సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
    చాల కాలంగా మీసం గడ్డంతో కనిపించిన చిరు ఇప్పుడు క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. నాగసౌర్య హీరోగా తెరకెక్కుతున్న జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు. ఈ సంబర్భంగా ఆయన ఈ కొత్త లుక్ తో అభిమానులకు కనిపించారు.