పులికి అల్ ది బెస్ట్ చిప్పిన సింహం

సినీ నటుడు సూర్య తన తాజా చిత్రం గ్యాంగ్ ప్రొమోషన్లలో భాగంగా సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఈ సందర్బముగా ఆయన పాదయాత్ర చేస్తున్న వైస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి అల్ ది బెస్ట్ చెప్పారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు వైఎస్ఆర్ కుటుంబంతో పరిచయం ఉందని అయన అన్నారు. తాను వైఎస్ జగన్ ని అప్పుడపుడు కలుస్తానని, తాము కలిసినపుడు రాజకీయాల గురించి ఎటువంటి చర్చరాదు అని ఆయన అన్నారు.ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన వైఎస్ జగన్మోహన్రెడ్డిలో బలంగా ఉందని, తాను ఈ విషయాన్నీ గమనించానని అయన అన్నారు.రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం చాల దురదృష్టకరమని, అది ఒక పెద్ద తీరని లోటు అని అయన అన్నారు. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చాలా ప్రాధాన్యం కలిగిందని, అలాగే ఇపుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సింహం సూర్య ఆల్ ది బెస్ట్ చెప్పారు.