కృష్ణార్జునులు వచ్చేసారు

Posted on : 16/01/2018 12:09:00 am

నాచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ మీద ఉన్నాడు, బ్యాక్ తో బ్యాక్ హిట్స్ ని ఎంజాయ్ చేస్తున్న నాని, తాజాగా తాను నటిస్తున్న కృష్ణార్జున యుద్దానికి సంబందించిన రెండు పాత్రలకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసాడు, ముందుగా చెప్పినట్లుగానే భోగి రోజున మాస్ కృష్ణుడిని, సంక్రాంతి రోజున క్లాస్ అర్జునుడిని జనాలకు పరిచయం చేసాడు. ఈ రెండు స్టిల్స్ జనాలను ఆకట్టుకుంటున్నాయి. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నాని కనిపించబోతున్నాడని పోస్టర్‌లను చూస్తే అర్థమైపోతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.