రంగస్థలం టీజర్ ఎపుడు వస్తుందో తెలుసా?

Posted on : 16/01/2018 12:18:00 am

  క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కంబినేషన్లో వస్తున్నా తాజా చిత్రం రంగస్థలం, కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ చిత్ర యూనిట్ విడుదల చేయలేదు, మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రంగస్థలం చిత్ర టీజర్‌ ఈ నెల 24 విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అలాగే ఈ సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ పోస్టర్ ఒకటి విడుదల చేసారు.
   విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఇటు మెగా అభిమానులలోనూ, అలాగే సుకుమార్ ఫాలోయర్స్ లోను బారి అంచనాలు ఉన్నాయి, ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ చిట్టిబాబు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. మర్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది.