మెగా అల్లుడి అరంగేట్రానికి అంతా సిద్ధం

Posted on : 16/01/2018 12:37:00 am

 మెగా అల్లుడు కళ్యాణ్ హీరోగా అరంగేట్రానికి అంత సిద్ధం అయింది, జతకలిసే ఫేం రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుంది. కళ్యాణ్ కి మంచి అరంగేట్రం కోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి అయింది, కథ, కథనం సిద్ధం అయ్యాయి. ఈ చిత్రం గురించి మెగా ఫామిలీ చాల జాగ్రత్తలు తీసుకుంటుంది.
  ఈ చిత్రానికి సంబందించిన నటీనటులను ఎంపిక చేయడం ప్రారంభించిన ఈ చిత్ర బృందం, లై ఫేమ్ మేఘా ఆకాష్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి, మేఘా ప్రస్తుతం నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. లై చిత్రం ఫెయిల్ అయినప్పటికీ నటిగా మేఘ మంచి మార్కులు సాధించింది. కళ్యాణ్ కి హీరోయిన్ గా మేఘ అయితే బాగుంటుంది అని చిత్ర యూనిట్ భావిస్తుంది. కానీ ఈ విషయం ఇంకా చిత్ర యూనిట్ ధ్రువీకరించలేదు.