అజ్ఞాతవాసి కలెక్షన్స్

Posted on : 16/01/2018 05:24:00 pm

 సంక్రాంతికి ముందుగా బరిలో దిగిన పందెం కోడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' అని తెలిసిన విషయమే. పవన్, త్రివిక్రమ్ కంబినేషన్కి మంచి క్రేజ్ ఉండటం 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ హిట్టుగా నిలవటం వలన 'అజ్ఞాతవాసి' పై మరింత అంచనాలను పెంచింది కానీ ఈ చిత్రం ఆ అంచనాలను ఈ మాత్రం అందుకోలేదని అందరికి తెలిసిన విషయమే, పవన్ తన ప్లాప్ సినిమాకి కూడా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టగల సత్తా ఉన్నవాడు, అనుకున్న వారంతా ఈ చిత్ర కలెక్షన్స్ చూసి నోర్లు వెళ్ళబెట్టుతున్నారు. ఈ చిత్రం మొదటి వారాంతం వరకు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

 మొదటి వారాంతానికి కలెక్షన్స్:


                                         షేర్(కోట్లల్లో)             గ్రాస్(కోట్లల్లో)
ఆంధ్ర/తెలంగాణ                               34.90           52.6
యు యస్ ఏ                                    6.93           12.6      
కర్ణాటక                                           6.02           9.8      
రెస్ట్ అఫ్ ఇండియా                              2.25          5.1  
----------------------------------------------------------------------------------------       
మొత్తం                                           50.1         80.1
----------------------------------------------------------------------------------------

 ఈ చిత్రం ఇప్పటివరకు 50.1 కోట్లు మాత్రమే రాబట్టింది, డిస్టిబ్యూటర్స్, బయ్యర్స్ నష్టపోకుండా ఉండాలంటే కనీసం 125 కోట్లు రాబట్టాలి. అంటే ఇంకా 75 కోట్లు రాబట్టాలి, ఈ చిత్రానికి వచ్చిన ప్లాప్ టాక్ వాళ్ళ సెలవు రోజులు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయాయ్. పోటీకి వచ్చిన బాలయ్య 'జై సింహ' సూర్య 'గ్యాంగ్' పరువలేధనిపించి మంచి కలెక్షన్స్ రాబట్టుతున్నాయ్.

 పవన్ కళ్యాణ్ గత చిత్రాలు కొనుగులు చేసిన వారికీ కూడా చేదు అనుభవాలు మిగిలించింది. మొదటి రోజు 40 కోట్లు షేర్ రాబతట్టిన ఈ చిత్రం తరువాత వారం రోజులు కలిపి ఈ చిత్రం కనీసం 10 కోట్లు షేర్ కూడా రాబట్టకపోవటం ఈ చిత్రాన్ని కొన్నవారికి కోలుకోలేని దెబ్బ. చూద్దాం ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత రాబడుతుందో...