మాకు కొత్త గవర్నర్ కావాలి

Posted on : 16/01/2018 09:59:00 pm

బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తాజాగా కేంద్రానికి ఒక లేఖ రాసారు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అయన లేఖ రాసారు. ఈ లేఖను కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అయన అందచేశారు. అలాగే రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆకాంక్షలకు అనుగుణంగా హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. అమరావతి నుంచే పాలన సాగేలా సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన అధికారిక కార్యాలయాన్ని విజయవాడకు మార్చుకున్నారని ఆయన అన్నారు.
  ప్రభుత్వం కూడా అమరావతిలో హైకోర్టు కోసం స్థలాన్ని వెతుకుతుందని, పాలన అంత ఎక్కడి నుంచే జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. అలాగే రెండు రాష్ట్రాలు ఉమ్మడి గవర్నర్ కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ ని మార్చాలి అని బీజేపీ కేంద్రం మీద బాగా ఒత్తిడి తెస్తుంది, బడ్జెట్ సమావేశాల లోపు కొత్త గవర్నర్ ని నియమించాలని బీజేపీ నేత, శాసనసభ్యుడు విష్ణుకుమార్‌ రాజు కేంద్రానికి అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.