బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం

Posted on : 07/01/2019 10:15:00 pm


బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా అవామీ లీగ్‌ అధ్యక్షురాలు షేక్‌ హసీనా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2018 డిసెంబరు 30న బంగ్లాదేశ్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 299 పార్లమెంటు స్థానాలకుగాను 288 స్థానాల్లో గెలుపొందింది. 1996లో షేక్ హసీనా తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.