హై కోర్టు ఆదేశాలు బేఖాత‌ర్ : అంబ‌టి

Posted on : 16/01/2018 10:36:00 pm

రాష్ర్టంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోడి పందెల పేరుతో జూద‌శాల‌లు తెరిచి వాటిని కార్పొరేట్ స్థాయిలో నిర్వ‌హిస్తూ, కోట్లాది రూపాయ‌ల అక్ర‌మ సంపాద‌న‌కు తెర తీశార‌ని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ధ్వ‌జ‌మెత్తారు. విజ‌య‌వాడలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాష్ర్ట కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

 క్రికెట్ పిచ్లు ఏర్పాటు చేసిన ట్వంటీ ట్వంటీ క్రికెట్ మాదిరిగా ఫ్ల‌డ్ లైట్లు పెట్టి కోడి పందెలకు కార్పొరేట్ లుక్ ను తీసుకువ‌చ్చార‌న్నారు. కోడి పందెల నిర్వ‌హ‌ణ‌కు హై కోర్టు  అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింద‌ని, ఏపీ ప్ర‌జాప్ర‌తినిధులు వాటిని బేఖాత‌ర్ చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. జూద‌శాల‌లుగా మార్చేసి ఏకంగా వారి ఫ్లెక్సీల‌తో ఆహ్వానిస్తూ క్రికెట్ పిచ్ లు మాదిరిగా బ‌రులు త‌యారు చేశార‌ని అరోపించారు. ఆ బ‌రులు చుట్టుతూ జూద‌క్రీడ‌లైన పేకాట , గుండాట, మ‌ద్యం షాపులు, బిర్యాని పాయింట్లు స్టాల్స్ పెట్టించి వాటిని  వేలం ద్వారా కోట్లాది రూపాయ‌ల‌కు విక్ర‌యించారిన ఆరోపించారు. ఇవి క‌ళ్లెదుట క‌నిసిస్తున్న పోలీసులు చూసి చూడ‌న‌ట్లు వ‌దిలివేశార‌ని తెలిపారు. పోలీస్ వ్య‌వ‌స్థ నిర్వీర్యం అయిపోయింద‌న్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు , ఉప‌ముఖ్యమంత్రి చిన్న‌రాజ‌ప్ప‌లు కోడి పందెల ప‌ట్ల చూసిచూడ‌న‌ట్లు ఉండ‌మ‌ని ఇచ్చిన ఆదేశాలు దీనికి కార‌ణం అని ఆయ‌న అనుమాన వ్య‌క్తం చేశారు. హోం మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలోనే పందెం కోళ్ల కాళ్ల‌కు క‌త్తులు క‌ట్టి మ‌రీ పోటీలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ఆయా స్టాల్స్ లో మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని అక్క‌డ టీడీపీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు ఫ్లెక్సీల‌తో స్వాగ‌త ద్వారాలు ఏర్పాటు చేయ‌డంతో  పోలీసులు అక్క‌డ‌కు వెళ్లే ధైర్యం చేయ‌లేక‌పోయార‌న్నారు. కోడి పందెల నిర్వ‌హ‌ణ‌పై హై కోర్టు ఆదేశాల‌ను  పాటించాల్సిన పోలీసులు ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో దానిని విస్మ‌రించార‌న్నారు. ఇదే పోలీసులు మాత్రం ప్ర‌తిప‌క్ష నేత వై.ఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా  కోసం ప్ర‌ద‌ర్శ‌న చేద్దామ‌ని విశాఖ ఎయిర్ పోర్ట‌కు వ‌స్తున్నార‌ని తెలిసి అడ్డుకుంటార‌ని, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు రిజ‌ర్వేష‌న్ అమ‌లు కోసం పాద‌యాత్ర చేద్దామంటే ఆయ‌న ఇంటిని, ఊరును చుట్టుముట్టి రోజుల త‌ర‌బ‌డి తిష్ట‌వేసి కాపు కాస్తార‌ని విమ‌ర్శించారు. చ‌ట్ట వ్య‌తిరేక, న్యాయ‌స్థాన ఆదేశాల‌కు విరుద్ధంగా జూదం, బెల్ట్ షాపులు, అస‌భ్య నృత్యాలు న‌డుస్తుంటే పోలీసులు చోద్యం చేస్తున్నార‌ని ఇది అత్యంత దారుణ‌మైన విష‌య‌మ‌న్నారు.

 క్రికెట్ అడుతున్నారంటే క్రికెట్ మ్యాచ్ ల స‌మ‌యంలో రాష్ర్టంలో దానికి జూదంగా పేర్కొంట ఇదే పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నార‌ని, కానీ చ‌ట్టం టీడీపీ నాయ‌కుల‌ను ఏం చేయ‌పోతుంద‌ని సిగ్గు చేటైనా విష‌య‌మ‌న్నారు. ఇలా క‌ళ్లెదురుగా ఆరాచ‌కాలు, న్యాయ‌స్థాన తీర్పుల ఆదేశాల‌ను స‌వాల్  చేస్తుంటే డీజీపీ, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఆయ‌న కార్యాల‌యాన్నే పేకాట స్థావ‌రం మార్చేసిన చ‌ర్య‌లుండం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా బాధ్యుల‌న వారిపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.