రాహుల్‌తో సిఎం చంద్రబాబు భేటీ...

Posted on : 08/01/2019 08:10:00 pm


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఢిల్లీలో రాహుల్ ని చంద్రబాబు ఈరోజు కలిశారు. భవిష్యత్ వ్యూహం, వివిధ రాష్ట్రాల్లో తలెత్తే పరిణామాలపై, ఇతర నేతలతో సంప్రదింపులు వంటి అంశాలపై వీరు చర్చించనున్నట్టు సమాచారం. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, సీతారాం ఏచూరీలతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నెల 19న కోల్ కతాలో బహిరంగం సభ అనంతరం, దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న భారీ ర్యాలీలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.   జాతీయ నేతలతో భేటీ అనంతరం, తమ పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 9న ఢిల్లీలో విపక్షాల భేటీకి కొనసాగింపుగా రాహుల్ ని చంద్రబాబు కలవడం గమనార్హం.