సినిమా భారీ నష్టాల్లో.. రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి!

Posted on : 08/01/2019 08:11:00 pm


ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజీ టాలీవడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. సాయి పల్లవి చివరగా నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు. హను రాఘవ పూడి దర్శత్వంలో శర్వానంద్ సరసన నటించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల విషయంలో సాయి పల్లవి తన మంచి మనసు చాటుకుంది.

ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల కట్టుకోలేకపోయింది. విడుదలకు ముందే నిర్మాత సాయి పల్లవికి సగానికిపైగా రెమ్యునరేషన్ చెల్లినట్లు తెలుస్తోంది. మిగిలిన రెమ్యునరేషన్ ని సాయి పల్లవి తీసుకోలేదట. 

సాయి పల్లవికి నిర్మాత ఇంకా 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంది. చిత్రం తీవ్రంగా నిరాశ పరిచినా కూడా నిర్మాత సాయి పల్లవికి మిగిలిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దపడ్డారట. కానీ సాయి పల్లవి మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా తన మంచి మనసు చాటుకుంది. ఈ సమయంలో ఈ డబ్బు మీకు చాలా అవసరం అని నిర్మాతతో చెప్పిందట. 

నిర్మాత సుధాకర్ చెరుకూరి సాయి పల్లవి తల్లి దండ్రులని పిలిపించి కూడా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. మా కుమార్తె డబ్బు తీసుకోవద్దని చెప్పింది. ఆమె నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. దయ చేసి డబ్బు తీసుకోమని బలవంతం చేయవద్దు అని ఆమె తల్లిదండ్రులు నిర్మాతతో తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి మంచి మనసు చాటుకుని వ్యక్తిత్వంలో కూడా తన ప్రత్యేకత చాటుకుంది. 

సాయి పల్లవి తన కుటుంబ సభ్యులకు ఎంత గౌరవం ఇస్తుందో ఆమెని అభిప్రాయాలకు వాళ్ళు కూడా అదేవిధంగా విలువ ఇస్తారు. నా చిత్రాలన్నీ నా కుటుంబ సభ్యులు చూసే విధంగా ఉండాలి. అందుకే గ్లామర్ షోలు, లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉంటాను అని తెలిపింది.