ప్రత్యేక రైలులో ప్రయాణించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Posted on : 08/01/2019 08:36:00 pm


భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక రైలులో ప్రయాణాంచారు. రేణిగుంట నుంచి నెల్లూరు జిల్లా వెంకటాచలంకు రైలులో ఆయన వెళ్లారు.ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై రైల్వే అధికారులతో వెంకయ్యనాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో దక్షిణ మధ్య రైల్వే జీఎం కులశ్రేష్ఠ, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఓబులవారిపల్లె నుంచి కృష్ణపట్నం వెళ్లేలా గూడ్స్ రైళ్ల పనులు జరుగుతున్నాయని, వీలైతే వాటిని ప్యాసింజర్ కు మార్చేలా రైల్వే ట్రాక్ పూర్తి చేయాలని సూచించానని, ఫిబ్రవరి 25 లోగా ఈ పనులు పూర్తి కావాలని ఆదేశించినట్టు చెప్పారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వై లైన్ కు సంబంధించి భూసేకరణ ఆలస్యమైందని, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వం వద్ద భూసేకరణలో జాప్యం జరిగిందని అన్నారు. నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లో వైఫై ఏర్పాటుకు ఆదేశించానని, గూడూరు- విజయవాడ మూడో లైన్ విద్యుద్దీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నెల్లూరు సౌత్ స్టేషన్ పనులకు పునాది వేశానని, అది పూర్తయిందని చెప్పారు.