మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బోయపాటి!

Posted on : 08/01/2019 09:16:00 pm


టాలీవుడ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులు వరుసగా పరిచయం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా, నందమూరి, అక్కినేని,మంచు కుటుంబాల వారసులు హీరోలుగా వచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. అయితే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించింది జూనియర్ ఎన్టీఆర్. దివంగత నందమూరి హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినా..ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.

అయితే కళ్యాన్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా పలు సినిమాలు తీశారు. ఇప్పటికే స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున తనయులు హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసింది. అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా మోక్షజ్ఞ సిల్వర్‌ స్క్రీన్‌ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోనే మోక్షజ్ఞ పరిచయమవుతాడన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఆ ఆలోచనను వాయిదా వేశారు. ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో మోక్షజ్ఞ కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి..కానీ ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే గతంలో మోక్షజ్ఞ తొలి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందన్న వార్తల వినిపించాయి.

ప్రస్తుతం బోయపాటి, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయరామ సినిమా ప్రమోషన్ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ..మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని తాను డైరెక్ట్ చేయబోవటం లేదన్నారు.రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అవుతుండగా తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ హీరోగా ప్లాన్‌ చేస్తున్నాడు బోయపాటి.