ఏపీ మంత్రి గంటాతో హాస్య నటుడు అలీ భేటీ

Posted on : 08/01/2019 10:10:00 pm


ప్రముఖ హాస్య నటుడు అలీ.. వైసీపీలో చేరతారన్న వార్తలు హల్  చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు వెలువడ్డ అనంతరం, సీఎం చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని అలీ కలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ క్రమంలో తాజాగా, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుని అలీ కలిశారు. ఆయనతో పలు విషయాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, రేపటితో జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో వైసీపీ కండువాను అలీ కప్పుకుంటారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ, టీడీపీ, జనసేన అధినేతలను అలీ ఇప్పటికే కలవడంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్న విషయంలో సందిగ్ధం నెలకొంది.