రాజ్యసభ పొడిగింపుపై విషక్షాల ఆందోళన

Posted on : 09/01/2019 02:17:00 pm


రాజ్యసభ శీతకాల సమావేశాల పొడగింపును నిరసిస్తూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడిగిస్తారంటూ సభలో ఆందోళనలు చెపట్టారు. పొడిగింపుపై ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. రాజ్యసభలో ఇప్పటివరకూ రఫెల్‌ సభా తాము డిమాండ్‌ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని అన్నారు. అయితే బీఏసీ సమావేశంలోనే రాజ్యసభ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి చాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని.. డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.