రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

Posted on : 09/01/2019 02:24:00 pm


రామాయపట్నం పోర్టుతో అనేక లాభాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పోర్టు మైనర్‌ పోర్టు కాదని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ఆయన అన్నారు. ఈ పోర్టు వల్ల సరకు రవాణాతోపాటు మత్స్యకారులకు కూడా లాభం కలుగుతుందని ఆయన చెప్పారు. పరిసర ప్రాంతాల వారికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ పేపర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.