ముగిసిన జగన్ పాదయాత్ర, ఇచ్ఛాపురంలో మూడంతస్తుల పైలాన్ ఆవిష్కరణ

Posted on : 09/01/2019 03:55:00 pm


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం నాడు ముగిసింది. 6 నవంబర్ 2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర ఇచ్ఛాపురంలో బుధవారం (09-01-2019) ముగింపు పలికారు జగన్. 

పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడనున్నారు. విజయస్థూపం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. మూడంతస్తులుగా స్థూపం దీనిని నిర్మించారు. పైలాన్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి కిలో మీటర్ల మేర వైసీపీ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. జగన్ రాకముందే ప్రాంగణం నిండిపోయింది.