వైసీపీలో చేరిన సినీనటుడు భానుచంద‌ర్

Posted on : 09/01/2019 04:04:00 pm


ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వైసీపీలో చేరారు. ప్రజాసంకల్ప యాత్ర చివరి రోజున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన భానుచందర్... ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భానుచందర్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భానుచందర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అప్పజెప్పే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.