‘కథానాయకుడు’ మూవీలా కాకుండా నిజంగా స్టోరీ చూస్తున్నట్టు ఉంది: నారా బ్రాహ్మణి

Posted on : 09/01/2019 04:16:00 pm


ఈరోజు విడుదలైన ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు చూశారు. అనంతరం, మీడియాతో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, ‘నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాన్న గారు అచ్చం తాతగారిలా ఉన్నారు. తాతగారు ఎప్పుడూ ప్రజాసేవ గురించి ఆలోచించేవారు, కుటుంబంతో చాలా తక్కువ సమయం గడిపారు. మా నాయనమ్మ బసవతారకం గారు నేను పుట్టకముందే పోయారు. ఆమె ఎంతో గొప్ప వ్యక్తి. తాతగారికి ఫిల్మ్ కెరీర్ లోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఆమె చాలా సపోర్టు చేశారు. ఈ చిత్రంలో అందరూ బాగా నటించారు. టెక్నీషియన్స్ కష్టపడ్డారు. ఈ చిత్రం హిట్ అవుతుంది. ఆ రిజల్ట్స్ కనిపిస్తాయన్న నమ్మకం ఉంది. ఈ చిత్రం మూవీలా కాకుండా నిజంగా స్టోరీ చూసినట్టు అనిపించింది. నాన్నగారి ప్రొడక్షన్ లో మొదటి సినిమా ఇది. దీనికి పూర్తి న్యాయం జరిగింది’ అని చెప్పారు.