వెంకీ- రేణు దేశాయ్.. పవర్‌ఫుల్ కాంబినేషన్!

Posted on : 09/01/2019 04:36:00 pm


విక్టరీ వెంకటేష్.. వెటరన్ హీరోయిన్ రేణు దేశాయ్..! ఈ కలయిక కమర్షియల్‌గా ఎంత గొప్పగా వర్కవుట్ అవుతుందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు! ఇద్దరూ కలిసి స్క్రీన్ పంచుకుంటే.. చూడముచ్చటగా ఉండడం గ్యారంటీ! కానీ.. వెండితెర మీదయితే కాదు.. బుల్లితెర మీద! ఇప్పటికి ఇదొక వదంతి మాత్రమే అయినా.. వాస్తవరూపం దాలిస్తే బాగుండునని టాలీవుడ్ సర్కిల్స్ ఆశిస్తున్నాయి. ఇంతకీ ఈ కాంబో డీటైల్స్ ఏమిటి?

తెలుగు బుల్లితెర సక్సెస్‌ఫుల్ రియాలిటీ షో.. బిగ్‌బాస్‌! ఇప్పటికే రెండు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మూడో సీజన్ కోసం ముస్తాబు జరుగుతోంది. జూన్లో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ థర్డ్ సీజన్ గురించి ఇప్పటినుంచే ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. హోస్ట్ కోసం గాలింపు మొదలుపెట్టిన నిర్వాహకులు మరోసారి తారక్ కోసం గాలం వేస్తున్నట్లు కొందరంటే.. RRRతో మరో రెండేళ్ల పాటు ఎంగేజ్ అయిన తారక్ బిగ్‌బాస్‌కి టైం ఎలాట్ చేయడం కష్టమని మరికొందరంటున్నారు. ఈలోగా ఫ్యామిలీ ఆడియెన్స్ షేర్ పెంచుకునే ఎత్తుగడలో భాగంగా.. విక్టరీ వెంకటేష్‌ని అప్రోచ్ అయినట్లు కూడా మేకర్స్ నుంచి ఒక ఫీలర్ బైటికొచ్చేసింది.

పార్టిసిపెంట్స్ విషయంలో కూడా ఈసారి కాసింత ఎక్కువ కసరత్తు జరుగుతోంది. ఖరీదెక్కువైనా కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యేవాళ్ళకే అవకాశం ఇవ్వాలని, ఆ మేరకు వడపోత కార్యక్రమం కూడా షురూ అయిందని చెబుతున్నారు. ఈ రేసులో మొట్టమొదటిగా వినిపిస్తున్న పేరు రేణు దేశాయ్. బుల్లితెర మార్కెట్‌తో ఇప్పటికే టచ్‌లో వున్న రేణు.. స్వచ్ఛందంగానే బిగ్‌బాస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈమెతో పాటు ఉదయభాను, వరుణ్ సందేశ్‌, హేమచంద్ర లాంటి చోటామోటా సెలబ్రిటీలు బిగ్‌బాస్-3 లో మెరవనున్నట్లు తెలుస్తోంది. షో మొదలయ్యేదాకా పార్టిసిపెంట్స్ డీటెయిల్స్ బైటికొచ్చే ఛాన్స్ లేదు కనుక.. అప్పటివరకూ ఇవన్నీ ఊహలకే పరిమితం. వెంకటేష్, రేణుదేశాయ్ ఓకే అయితే మాత్రం.. ఆట రక్తి కట్టడం ఖాయం!