చేతికి గాయం కారణంగా ‘రోజా’ను వదులుకున్నా: వెంకటేష్

Posted on : 09/01/2019 07:32:00 pm


అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

రోజా సినిమాను నిజానికి తాను చేయాల్సి ఉందని.. కానీ ఎందుకు చేయలేకపోయాననే విషయమై క్లారిటీ ఇచ్చారు. ‘‘రోజా’ సినిమాను నేను చేయాల్సింది. కానీ చేతికి గాయం కావడంతో చేయలేకపోయా. దాని గురించి నేనెప్పుడూ బాధ పడలేదు. ఆ సినిమా చేయలేకపోయినా ‘సుందరకాండ’ వంటి కుటుంబ కథా చిత్రాలు ఎన్నో చేశాను. ఏం జరిగినా మన మంచికే అనుకుంటాను’’ అని వెంకీ తెలిపారు.