అభివృద్ధి పథంలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోంది: సీఎం చంద్రబాబు

Posted on : 09/01/2019 08:38:00 pm


అదానీ గ్రూప్, ఏపీ ఐటీ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. రాజధాని అమరావతిలో నిర్వహించిన ప్రజావేదికలో చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు రానున్నాయని అన్నారు. అభివృద్ధి పథంలో ఐటీ కీలక పాత్ర పోషిస్తోందని, రేపటితరం అభివృద్ధిలో డేటా రంగానిదే కీలకపాత్ర అని, రానున్న రోజుల్లో ఏపీ డేటా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. డేటా రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.