తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్" /> తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్" />

టీడీపీ అభ్యర్థి ఇంట్లో క‌ల‌క‌లం

Posted on : 03/04/2019 08:39:00 pm

తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లా మైదుకూరు తెదేపా అభ్యర్థి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో రెండు బృందాలు సుమారు గంట నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్‌ నివాసంలో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సమాచారం. ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండటంతో వారి సమక్షంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టు సమాచారం.