హజ్ సబ్సిడీ ఎత్తివేసిన బీజేపీ

Posted on : 17/01/2018 01:24:00 am

   దేశంలో చాల మంది ముస్లింలు ప్రతి సంవత్సరం హజ్ యాత్రకి వెళ్తూ వుంటారు, భారత్ ప్రభుత్వం హజ్ యాత్ర వెళ్లే వారికీ కొంత సబ్సిడీ ఇస్తుంది, కానీ ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు ఎటువంటి సబ్సిడీ లేదని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2012 లో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, మైనార్టీలను బలపరిచేందుకు ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పుకొచ్చారు.
   ఈ సంవత్సరం 1.75 లక్షల మంది ముస్లింలు హజ్ యాత్రకి వెళ్తున్నారు అని, గత ఏడాది 250 కోట్ల రూపాయలు సబ్సిడీకి ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నిర్ణయం పునః సమీక్షించాలని , బిజెపి దీర్ఘకాలం కోరుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద పిల్లల సంక్షేమం కోసం ఈ డబ్బు ఉపయోగించాలని ఆశించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, జస్టిస్ అఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మే 2012 లో 10 సంవత్సరాలలో హజ్ సబ్సిడీ క్రమంగా రద్దు చేయాలని ఆదేశించింది. మైనారిటీల సంక్షేమ, అభివృద్ధి, విద్య కోసం ఈ డబ్బును వాడుకోవాలని కోర్టు ఆదేశించింది.
  సుప్రీం కోర్ట్ సూచించిన తేదీకి దాదాపు నాలుగు సంవత్సరాలకు ఈ సబ్సిడీని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని వల్ల ఎటువంటి సమస్య లేదు ... ప్రభుత్వం తీర్పు యొక్క రెండవ భాగo అయిన డబ్బును పేద పిల్లల సంక్షేమ మరియు విద్య ఉపయోగిస్తుందని తాను విశ్వసిస్తున్నాను అని ఆయన అన్నారు.
   సుప్రీంకోర్టు హజ్ యాత్రికులపై చేసే ఖర్చు వల్ల మైనారిటీల కంటే ఎయిర్ లైన్స్ బాగా లబ్ది పొందుతున్నారు అని, వాటిని నెమ్మడిగా తగ్గించాలని ఆ డబ్బును మైనారిటీల సంక్షేమానికి ఉపయోగించాలి అని 2012 లో నిర్ణయించింది. దీనిని అనుసరించి మోడీ ప్రభుత్వం ఇవాళ హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేసింది.
     యాత్రికుల ఖరీదును తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని, సౌదీ అరేబియాతో చర్చల తర్వాత భారతీయులు సముద్రమార్గం ద్వారా హజ్ యాత్రకు అనుమతి లభించింది అని లక్వి అన్నారు.