ఆర్మీకి శుభవార్త

Posted on : 17/01/2018 01:36:00 am

భారత ఆర్మీ కోసం రైఫిల్స్ మరియు కార్బైన్లను కొనేందుకు కేంద్ర రక్షణ శాఖ పచ్చజండా ఊపింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) చేత నేడు రైఫిల్స్ మరియు కార్బైన్లను సేకరించేందుకు రూ. 3,547 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదన జరిగింది. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా భారత్ లోనే ఇవి తాయారు చేయనున్నారు.
రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన DAC సమావేశంలో ఈ ప్రతిపాదన కింద 72,000 రైఫిళ్లు మరియు 93,895 కార్బైన్లు యుద్ధ ప్రాతిపదికన ఆర్మీ అమ్ముల పొదిలో చేరనున్నాయి.
    సరిహద్దులో మోహరించిన భద్రతా దళాల కోసం ఈ ఆయుధాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది, దీని ద్వారా ఆయుధాల కోరతకు పరిష్కారం దొరుకుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయుధాల సేకరణ కోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది.