దక్షిణ కొరియాలో కేటీఆర్

Posted on : 17/01/2018 10:46:00 am

రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బృందం పలు కంపెనీల సియివోలు, కంపెనీల ప్రతినిధుల సమావేశాలతో బిజీ జిజీగా గడిపారు. మోబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్ (మెయిబా)తో మంత్రి ప్రతినిధి బృందం సమావేశం అయింది.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, టెక్స్టైల్ రంగంలోని పెట్టుబడులకు ఆకర్షనీయ ప్రదేశమని, పెట్టబడులతో ముందుకు వచ్చే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.  తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, టియస్ ఐపాస్ వంటి ముఖ్యాంశాలను మంత్రి వారికి వివరించారు.

కొరియా టెక్స్టైల్ సిటీ పేరుగాంచిన దైగు మెట్రోపాలిటన్ ( Daegu) నగరాన్ని మంత్రి ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ నగరంలో కొరియన్ టెక్స్టైల్ , ఫ్యాషన్ మరియు హై టెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నది. ఈ నగర డిప్యూటీ మేయర్ కిమ్ యాన్ చాంగ్ తో సమావేశం అయిన మంత్రి నగరంలో టెక్స్టైల్ పరిశ్రమల పారిశ్రామిక ప్రగతి పైన చర్చించారు. దైగు నగర ఇన్నోవేషన్ మరియు అర్దిక విభాగ బృందంతో సమావేశం అయిన మంత్రి వారిని ఇమేజీ టవర్ ప్రాజెక్టులో భాగస్వాములు  కోరారు.  మంత్రి కెటి రామారావు వెంట తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ యంపి జి. వివేక్ తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష రంజన్ ఇతర అధికారులున్నారు.

ముఖ్యంగా  టెక్స్టైల్ పరిశ్రమల సమాఖ్య కోఫోతి( KOFOTI) చైర్మన్ కిహూక్ సుంగ్ మరియు ఇతర కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కిహుక్ చైర్మన్ గా ఉన్న  యంగ్వాన్ సంస్ధ ఇప్పటికే కాకతీయ టెక్స్టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. యంగ్వాన్ సంస్ధ నార్త్ ఫేస్ అనే బ్రాండ్ పేరుతో వస్త్రాలను తయారు చేస్తుంది. ఈ బ్రాండ్ రానున్న ఒలిఫింక్స్ క్రీడలకు అధికారిక భాగస్వామిగా ఉన్నది. డైటెక్ అధ్యక్షులు Mr Yoon Nam sikతో సమావేశం అయిన మంత్రి మెగా టెక్స్ టైల్ పార్కులో వాటర్ ట్రీట్ మెంట్, మానవ వనరుల నిర్వహాణ వంటి అంశాల్లో సాంకేతిక సహకారమందించాల్సిందిగా కోరారు. డైటెక్ పరిశ్రమలో మంత్రి బృందం పర్యటించింది.