మొన్న జగన్, నిన్న మహేష్

Posted on : 19/01/2018 05:49:00 pm

    ఈ మధ్య ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్స్ వాడకం పెరగడంతో ఇప్పటివరకు మనం ఊహించని మార్గాల్లో దోషపూరిత సమాచారాన్ని, ఉద్దేశపూర్వక వ్యక్తిగత దాడులను, ముసుగులో తమ రాజకీయ అజెండాలను జనాల్లోకి చేరుస్తున్నారు రాజకీయ, సినీ ప్రముఖులు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి, ఒక ఫేక్ న్యూస్ ని వ్యాప్తి చేయడానికి, ఒక వ్యక్తి మీద కానీ, ఒక రాజకీయ పార్టీ మీద కానీ, ఒక సినిమా మీద కానీ అబద్దపు ప్రచారానికి ఈ ముసుగు మాఫియా బాగా కృషిచేస్తుంది. ఇప్పటికే చాల వరకు జనాల్లోకి వెల్లిన ఈ మాఫియా సాధారణ ప్రజానీకంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నాయి. ఈ సరికొత్త ప్రచారాలను అర్ధం చేస్కోవడం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు, పరిశోధకులకు, పాత్రికేయులకు కూడా చాల కష్టసాధ్యమైనదే. ఒక పార్టీ, ఒక వ్యక్తి జండాను, వారి అజెండాను మోసే ఈ ముసుగు మాఫియా, తటస్థ ముసుగులో జనాల్లోకి వెళ్లి, సమయం దొరికినప్పుడల్లా విష ప్రచారాలను జనాల్లోకి పంపిస్తున్నాయి.
    ఈ ముసుగు మాఫియా జనాల్లోకి వెళ్ళడానికి జనాకర్షణమైన కామెడీ, సెటైర్స్, వైరల్ వీడియోస్, కరెంట్ ట్రెండ్స్ మీద తరుచు పోస్టులు చేయడం, తద్వారా సాధారణ జనాలను ఆకర్షించడం. ఒక సారి వారికీ కావాల్సిన అంతమంది ఫాలోయర్స్ దొరికినపుడు సమయం చూసి తమ విషప్రచారాన్ని జనాల్లోకి చేరుస్తున్నాయి. రాజకీయాల నుంచి సినిమాల వరకు ఈ ముసుగు మాఫియా తమకి వ్యతిరేఖ వర్గాల మీద తటస్థ ముసుగులో విషం చిమ్ముతున్నాయి. హిల్లరీ నుంచి జగన్ వరకు, మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్ వరకు ఈ ముసుగు మాఫియా బాధితులే.
     అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ అవడానికి ఈ ముసుగు మాఫియా చాల కారణం అయింది అని ఇంటర్నేషనల్ అకాడెమిక్ జర్నల్ న్యూ మీడియా అండ్ సొసైటీ తమ వ్యాసంలో పేర్కొన్నాయి.

మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా ఈ మాఫియా బాధితులే
   సినిమా ఇంకా ఒక్క షో కూడా పడకముందే రివ్యూలు రాయడం, కొంతమంది మహేష్ బాబు, అల్లు అర్జున్ అభిమానులుగా వారి ఫోటోలు పెట్టుకొని సినిమా పూర్తి అవకుండానే "మరోసారి అన్న డిస్సపాయింట్ చేసాడు", "ట్రూ ఫ్యాన్ గా చెబుతున్న మూవీ అస్సలు బాగోలేదు" అని నెగటివ్ కామెంట్స్ సినిమా చూడకుండానే చేస్తారు, వీటినే స్క్రీన్ షాట్స్ తీస్కొని వారి న్యూట్రల్ / ట్రోల్ పేజెస్ లో పోస్ట్ చేయడం, వారికీ ఉన్న బోట్స్ ద్వారా రీట్వీట్స్, షేర్ చేయడం ఈ మాఫియా చేసే పని. అలాగే వారికీ ఉన్న తటస్థ ముసుగు పేజెస్ లో నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం. సినిమా కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్ కంటే ముందు వీరే పోస్ట్ చేయడం ఇలాంటి పనులు ఈ మాఫియా చేస్తూ ఉంటుంది. కొన్ని సినిమా కలెక్షన్స్ చూపించే వెబ్ సైట్స్ ద్వారా సినిమా కలెక్షన్స్ తక్కువ చేసి చూపడం వంటివి ఈ మాఫియా చేసే పనుల్లో ఒకటి.

మొన్న స్పైడర్, డి జే
  స్పైడర్ సినిమా దుబాయ్ లో డిజిటల్ కీస్ రావడం ఆలస్యం అవడం ద్వారా చాల ఆలస్యంగా ప్రదర్శించబడింది, అమెరికాలో కూడా ఇలానే జరిగింది, ఈ లోపు తమ వెబ్ సైట్స్, ఫేక్ అకౌంట్స్ ఉపయోగించి ఈ మాఫియా సినిమా మీద నెగటివ్ గా ప్రచారం చేసాయి, అంతే కాకుండా ఫాన్స్ / న్యూట్రల్ ప్రేక్షకుల ముసుగులో సినిమా మొదలవక ముందే ఇవి ప్రచారం చేసాయి. అగ్ర హీరోల పి ఆర్ ఓ లు, ఫేక్ డిస్ట్రిబ్యూటర్ అకౌంట్లతో విష ప్రచారం చేసాయి. ఒక అగ్ర హీరో భజ చేయడానికి ఇష్టపడలేదు అని అల్లు అర్జున్ డి జె సినిమా మీద కూడా ఇలానే విష ప్రచారం చేసాయి.  
   
 
ఇక్కడ జగన్

   2014 లో జగన్ ఓటమికి ఈ ముసుగు మాఫియా ఎంతగానో కృషిచేసింది, దాన్లో వారు విజయం సాధించారు అనే చేప్పాలి. కోర్టులో ఇంకా దోషిగా నిరూపించకుండానే లక్షకోట్లు, దొంగ, జైలు అని జగన్ మీద ఉన్నవి లేనివి కలిపి విషప్రచారం చేసారు, వైజాగ్లో కడప రౌడీలు 2 బస్సులో వచ్చారు అని, జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే విధ్వంసం సృష్టిస్తారు అని బాగా ప్రచారం చేసి వైస్ విజయమ్మని ఈ ముసుగు మాఫియా ఓడించింది. తాజాగా నంద్యాల ఎన్నికలలోను చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి చేసిన బెదిరింపులకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వని ఈ మాఫియా, జగన్ మాటను చాలా పెద్దది చూపించడంలో విజయం సాధించాయి. ఈ విషయాలు వైస్సార్సీపీ కి చాల ఆలస్యగా తెలిసాయి, అప్పటికి సోషల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసుకోవడంలో వైస్సార్సీపీ పూర్తిగా విఫలం అయింది. తమ మీద చేస్తున్న విషప్రచారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న జగన్ సోషల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. దొంగ అని, లక్షకోట్లు అని వేసిన ముద్రలను చెరిపేందుకు ఇప్పటికే పలు సార్లు అయన తన ఆస్తిని మొత్తం రాసిస్తా అని, రాజకీయ సన్యాసం చేస్తా అని సవాలు కూడా చేసారు.
   
ఒక ప్రత్యేక అజెండాను ప్రచారం చేయడానికి ఉద్దేశపూర్వకంగా విషప్రచారాలను చేసే ఈ ముసుగు మాఫియాకి దూరంగా ఉండండి, వారి అభిప్రాయాలను మీ మీద రుద్దే ఈ మాఫియాను కనిపెట్టడం పెద్ద విషయమేం కాదు, ఒక విషయాన్నీ గుడ్డిగా నమ్మకుండా మన విజ్ఞతతో కొంత పరిశోధన చేస్తే ఈ మాఫియాని చాల సులభంగా గుర్తించవచ్చు. తస్మాత్ జాగ్రత్త