రంగస్థలం టీజర్ రివ్యూ

Posted on : 25/01/2018 01:52:00 am

ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్న రంగస్థలం టీజర్ ని కొద్ది సేపటి క్రితమే రాంచరణ్ తన FB అకౌంట్  ద్వారా రిలీజ్  చేసాడు.  

నేను సౌండ్ ఇంజనీర్ ని అంటూ చరణ్ చూపిన చిన్న మాసీ లుక్ మెగా అభిమానుల్నే కాదు, నోర్మల్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆశ్చర్యానికి  గురి చేసింది. పాత్ర కొసం తనని తాను మార్చుకున్న తీరు బాగా నచ్చింది అంటున్నారు వీక్షించిన వారు, చూసిన ప్రతి ఒక్కరిని టీజర్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. టీజర్ లో చరణ్ హావ భావాలు చాల కొత్తగా ఉన్నాయి...సోషల్  మీడియా లో రిలీజ్  అయిన 50 నిముషాల్లోనే 1 మిలియన్  వ్యూస్  సాధించడం విశేషం.
 
క్లాస్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఈ ఫిల్మ్ తో B, C సెంటర్స్ కి దగ్గర అవుతాడు అనడం లో అనడం లో సందేహం లేకున్నా, ఒక యాంగిల్ లో మాత్రం ఈ సినిమా చాలా క్లాసీ టచ్ ఉందని చెప్పకనే చెపుతోంది ఈ టీజర్.

రాంచరణ్ చెవిటి వాడి గా నటిస్తున్న ఈ చిత్రం లో సమంత హీరోయిన్ కాగా జగపతి బాబు అండ్ అనసూయ ప్రధాన పాత్రలు పొషించారు. మార్చి 30 న ఈ చిత్రం విడుదల కానుంది.