ఇండియన్ తో ట్రంప్ ఎఫైర్

Posted on : 27/01/2018 07:21:00 pm

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరే ఒక సంచలనం, ఆయన ఏ పని చేసినా అంతర్జాతీయ మీడియా కు వార్తాంశమే! అలాంటిది ట్రంప్ కి ఎఫైర్ ఉందని తెలిస్తే ఆవార్తను సోషల్ మీడియా ఏ రేంజ్ లో వైరల్ చేస్తుందో వేరే చెప్పాలా!


ఫైర్ అండ్ ది ప్యూర్ ఇన్ సైడ్ ది ట్రంప్ అనే పుస్తకం లో మైకేల్ ఉల్ఫ్ రాసిన అంశాలు సంచలనం సృష్టిస్తోంది. ఐక్యరాజ్యసమితి లో అమెరికా రాయబారిగా విధులు నిర్వహిస్తున్న నిక్కీ హేలి, డొనాల్డ్ ట్రంప్ ల ఎఫైర్ గురించి ఈ పుస్తకం లో రచయిత చేసిన ప్రస్తావన ఆసక్తి కరంగా మారింది. ఈ విషయాన్ని అమెరికా అధికారిక భవనం ప్రస్థావించడం ఈ వార్త కు ప్రాధాన్యత సంతరించుకుంది.

వాస్తవానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని రచయిత డైరెక్ట్ గా ప్రస్థావించక పోయినప్పటికీ, వారిద్దరూ ప్రవేటు సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ లో చక్కర్లు కొట్టారని వోల్ఫ్ సంచలనానికి తెరలేపారు.

అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని నిక్కీ కొట్టి పారేశారు. రాజకీయ ప్రయోజనం కోసం తానెప్పుడూ పాకులాడలేదన్నారు. ఆ మాట కొస్తే ట్రంప్ ని ఒంటరిగా కలవలేదని స్పష్టం చేశారు. ఒక సారి కలిసి ప్రయాణం చేశామన్నారు, ఈ ప్రయాణం లో తమతో పాటు చాలా మంది ప్రయాణికులు ఉన్నాయన్నారు.

ఇలాంటి నిరాధారమైన వార్తలు చిరాకు కలిగిస్తాయని నిక్కీ అన్నారు. తనలాంటి సక్సస్ఫుల్ మహిళలపై ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పారు. భారతీయ సంతతికి చెందిన మహిళపై ఇలాంటి వార్తలు రావడం పట్ల ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

నిక్కీ సాదాసీదా వ్యక్తి కాదు సౌత్ కరోలీ గవర్నర్ గా తొలి భారతీయ మహిళ. 2016లో ఫ్లోరిడా  సెనేటర్ గా మార్కో రూబియో ని మద్ధతు పలికారు, అనంతరం రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ అభ్యర్థిగా ఖరారు కాగానే నిక్కీ తనకు మద్దతు దారుగా మారిపోయింది.

ట్రంప్ కూతురితో స్నేహాన్ని కొనసాగించే నిక్కీ వారి వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారనేది ఈ పుస్తకం లో రచయిత చెప్పిన సారాంశం గా తెలుస్తోంది.