2018 ప్లానింగ్ కు ముందు ఈ ప్రశ్నలు...?

Posted on : 01/01/2018 12:53:00 am

2018లో మీరు ఎంతో ఇష్టంగా నేర్చుకోవాలని అనుకుంటున్న నైపుణ్యం ఏంటి?
    ఇప్పటికే నేర్చుకున్న నైపుణ్యాల్లో దేన్ని మెరుగు పరుచుకోవాలనుకుంటున్నారు?
    తప్పకుండా చదవాల్సిన పుస్తకాల పేర్లు...?
    మీ ముందున్న లక్ష్యాలు? వీటిని చేరుకునేందుకు ఈ ఏడాది చేయాల్సిన కృషి?
    మీకున్న బలాలు...? వీటిని కొనసాగించేందుకు ఏం చేస్తారు?
    మీకున్న బలహీనతలు ఏవి? వీటి నుంచి బయటపడేది ఎలా?
    మీ జీవిత భాగస్వామి, పిల్లలతో ఉన్న అనుబంధం మరింత పటిష్టం చేసుకోవడం ఎలా?
    శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు మీ వంతుగా ఈ సంవత్సరంలో ఏం చేస్తారు?
    మీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తుత స్థితి నుంచి ఎలా మెరుగుపరుచుకుంటారు?
    మిమ్మల్ని నిరాశకు గురి చేస్తున్నవి ఏవి? వీటిని దూరం చేసేందుకు ఉన్న మార్గాలు..?
2017కు సంబంధించిన చేదు గుర్తులను చెరిపేయండి. గత చీకటికి, ప్రకాశవంతమైన రేపటికి మధ్య అడ్డుగా ఉన్న భావోద్వేగ గోడలను బద్దలు కొట్టండి. ప్రశాంతమైన మనస్సుతో, రెట్టించిన ఉత్సాహంతో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేయండి.
    మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చేయాల్సిన పనుల్లో మొదటిది. స్వీయ అభిమానం అన్నది తిరుగులేనిది.
    పెయింటింగ్ లేదా డ్యాన్స్ లేదా వంట చేయడం లేదా పాటలు పాడడం ఏదో ఒక హాబీ ఉండాలి. నిత్యం ఎంత బిజీ షెడ్యూల్ అయినా హాబీ కోసం కొంచెం సమయం కేటాయించి తీరాల్సిందే. ఎందుకంటే మీకు ఆనందాన్చిచ్చేవి చేయడం ద్వారా మీలో శక్తి ఇనుమడిస్తుంది. దీనివల్ల ఒత్తిడినీ జయించొచ్చు.
    కొత్త ఏడాదిలో ఏం చేయాలనుకుంటున్నారు...? ఊటీ లేదా మైసూర్ లేదా తాజ్ మహల్ సందర్శించాలనుకుంటున్నారా...? కొత్తగా బిజినెస్ కు ప్లాన్ చేసుకుంటున్నారా...? లేక ఉన్న రంగంలో నైపుణ్యాలను పెంచుకోవాలనుకుంటున్నారా...? లక్ష్యం ఏదైనా దానికో స్పష్టతనిచ్చి, షెడ్యూల్ ఖరారు చేసుకుని అనుకున్న ప్రకారం ఆచరణలో పెట్టేయండి. విజయం మీదే అవుతుంది. అంతేకానీ, ఈ లక్ష్యాలనే తర్వాతి సంవత్సరం కోసం తాజాగా ఉంచుకోకండి.