ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి విధ్వంసం

Posted on : 27/01/2018 11:06:00 pm

నిత్యం ఏదో ఒక బాంబు దాడులతో అల్లడిల్లితున్న ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి బాంబ్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 95 మంది చనిపోగా మరో 158 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో నింపిన అంబులెన్స్ ద్వారా ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ మధ్య జరిగిన సంఘటనలలో ఇదే పెద్దదిగా తెలుస్తుంది. ఉగ్రవాదులు ఈ సారి అంబులెన్స్ లో పేలుడు పదార్థాలు నింపి జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పేల్చేసినట్టుగా తెలుస్తోంది. పెద్ద పెద్ద సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. తాలిబన్లు ఈ దాడి చేసినట్టుగా ప్రకటించారు. ఈ దాడి ఈ వారంలో రెండవదిగా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్ నగరం ఇపుడు ఒక వైపు తాలిబన్లు, మరోవైపు ఐసిస్ దాడులతో అట్టుదుకుతుంది. అంబులెన్స్ లో ఉన్న సూసైడ్ బాంబర్ చవుబ్రతుకుల మధ్య పేషెంట్ వున్నాడు అని చెప్పి రెండు చెక్ పాయింట్లను దాటినట్లు తెలిస్తుంది. ఈ దాడిలో చనిపోయిన చాలా మంది సాధారణ పౌరులుగా తెలుస్తుంది. అంబులెన్స్ ని సాధారణంగా తనిఖీ చేయరని తెలిసి ఉగ్రవాదులు ఈ దూరగతానికి పాలుపడ్డారు. రెడ్ క్రాస్ సంస్థ దీనిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. ఈ వారం కాబుల్ లో జరిగిన మరో దాడిలో 25 మంది చనిపోయారు. విదేశీయులనే టార్గెట్ గా పెట్టుకొని చేసిన దాడిలో చాలా మంది విదేశీయులు ఉన్నారు.
 
ఎటు చూసినా రక్తం, చిన్నిపోయిన విగత జీవాలు, గాయపడ్డ వారి అర్థనాథలతో కాబుల్ తల్లడిల్లుతుంది. కాబుల్ అంత రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మనిషి తయారు చేసిన మతం కోసం, అదే మతంలో మంచిని వదిలేసి, మనిషిలో మానవత్వాన్ని వదిలేసి అమాయక ప్రజలను చంపుతున్న ఈ ఉన్మాదం ఎప్పుడు పోతుంది, ఆఫ్ఘన్ ప్రజల కన్నీరు ఎప్పుడు ఆగితుందో. ఒక్క ముర్కుడు చేసిన తప్పు కోసం దేశం మొత్తాన్ని నాశనం చేసిన అమెరికా తప్ప, మత చందసవతంతో అమాయకులను చంపుతున్న ఉగ్రవాదుల తప్ప, సిరియా ప్రభుత్వం రావాలి అని మరణ హోమాలు చేస్తూ అమాయకులను బలి పశువులు చేస్తున్న ఐసిస్ తప్ప, అన్ని తెలిసి మౌనంగా చూస్తున్న ప్రపంచం తప్పా? తప్పు ఎవరిది అయిన చివరికి బలయ్యేది అమాయక ప్రజలే. ఆఫ్ఘన్ ప్రజలకు మళ్ళీ సాధారణ జీవితం రావాలని దేవుడిని ప్రార్థిద్దం.