గిఫ్టిచ్చాడు బ్రదర్

Posted on : 06/02/2018 12:43:00 am

ప్రేమికుల రోజు ప్రత్యేకత గురించి స్పెషల్‌ చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ప్రేమిస్తున్న వారికి తెలుపుకునే రోజది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఫ్యాన్స్‌పై తనకున్న ప్రేమను తెలుపుతూ.. వాలెంటైన్స్‌ డే కానుకగా ఓ గిఫ్ట్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

అర్జున్‌ అప్‌కమింగ్‌ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలోని రెండో పాటను ప్రేమికుల రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌గా విడుదల చేయనున్నారు. ‘లవర్స్‌ ఆల్సో.. ఫైటర్స్‌ ఆల్సో’ అని సాగే పాట తొలిసారి వినగానే తనకు నచ్చిందని, మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నానని అల్లు అర్జున్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ పేర్కొన్నారు.

ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ శేఖర్ సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రంతో ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.