పెళ్లికూతురు కానున్నశ్రీయ

Posted on : 06/02/2018 09:27:00 pm

తెలుగు తెరపై కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగిన శ్రీ య దాదాపు అందరు అగ్ర కాథనాయకుల సరసన నటించింది. ఓ మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీయ తన అభిమానులకు మాత్రం చేదు వార్త చెప్పనుంది. చేదు వార్తంటే చేదు వార్త కాదు గానీ తాను పెళ్లి చేసుకోబోతందనే వార్త తనకు తీపి వార్త అయినప్పటికీ తనను ఆరాధించే ఎంతో మంది పురుషాభిమానులకు నిజంగా ఈ విషయం చేదు వార్తే అంటున్నారు సినిమా జనాలు.

 వివరాల్లోకి వెళ్తే..

సౌత్ లో సీనియర్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియ త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న వార్త ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌ లో హాట్‌ టాపిక్ గా మారింది. 35 ఏళ్ల వయసులోనూ ఈ జనరేషన్‌ హీరోయిన్‌ లకు గ్లామర్ లో పోటి ఇస్తున్న ఈ భామ సీనియర్‌ హీరోల సరసన నటిస్తూ కెరీర్‌ కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ మార్చిలో పెళ్లికూతురు కానుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్‌ చేస్తోంది.

 
ఇటీవల పరిచయం అయిన ఓ రష్యన్‌ యువకుడితో శ్రియ సన్నిహితంగా ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఆ యువకుడినే వచ్చే నెలలో వివాహమాడేందుకు రెడీ అవుతుందట. తన విషయంపై అబ్బాయి తరపు వారితో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యా వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. డెహ్రడూన్‌ కు చెందిన ఈ భామ డెస్టినేషన్‌ వెడ్డింగ్ తరహాలో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో శ్రియ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయిట. అయితే ఈ విషయంపై శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక సమాచరం లేదు.