తెలుగు ఇండస్ట్రీలో మరో భారీ ప్రాజెక్ట్

Posted on : 07/02/2018 07:23:00 pm

దగ్గుబాటి ముద్దు బిడ్డ టాలీవుడ్ లో టార్జాన్ లాంటి ఫిజికల్ అప్పీరెన్స్ తో, బాహుబలిలో తన భుజ బలంతో పాటు నెగిటివ్ రోల్ తో ప్రపంచాభిమానులను సైతం మెప్పించిన రాణా మరోక్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1945, హాథీ మేరీ సాథీ, రాజా మార్తండ వర్మ సినిమాలలో నటిస్తున్న రానా ఓ టాలీవుడ్ సీనియర్‌ దర్శకుడితో సినిమా చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న క్రియేటివ్‌ డైరెక్టర్ కృష్ణవంశీ రానా హీరోగా ఓ ఇంట్రస్టింగ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

వరుస పరాజయాల తరువాత తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న కృష్ణవంశీ, కొత్త సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాణా తో పాటు తమిళ నటుడు మాధవన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ తో కలిసి నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రాణా మాధవన్ తో స్క్రీన్ పంచుకోనున్నారు. వీరిద్దరికీ మల్టీస్టారర్ సినిమాలు బాగానే వర్కవుటయ్యాయనే చెప్పొచ్చు. అందులోనూ క్రిష్ణవంశీ సినిమా అంటే అభిమానుల్లో మామూలుగానే మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. సో త్వరలోమరో సూపర్ హిట్ సినిమాతో క్రిష్ణవంశీ కౄ తెలుగు సినిమా అభిమానులకు పలకరించబోతున్నారన్న మాట.