సేమ్ టు సేమ్ మెగాస్టారే

Posted on : 07/02/2018 07:42:00 pm

మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి హీరాయిన్‌గా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ "ఇంటిలిజెంట్" సినిమా పై భారీ అంచనాలే పెట్టుకుంది తెలుగు ఇండస్ట్రీ. ఈ నెల9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది వినాయక్ అండ్ టీమ్. స్వతహాగా లుక్స్ లో పవన్ కల్యాణ్, డ్యాన్స్ లో మెగాస్టార్ కట్సున్న సాయిధరమ్ తేజ్ ఒక్కో సందర్భంలో సేమ్ టు సేమ్ చిరంజీవి లాగానే డ్యాన్స్ చేశారని డైరెక్టర్ వి.వి.వినాయక్ తెగ మురిసిపోతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్‌కి, సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తుండటంతో సినిమా గ్యారెంటీగా హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్తోంది చిత్ర యూనిట్‌.
 
ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వి.వి.వినాయక్‌ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా సాయిధరమ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ వుండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తేజ్‌ తన స్టైల్‌లో బాగా చేశాడు. కామెడీ, యాక్షన్‌ సీన్స్‌లలో అద్భుతంగా చేశాడు. పర్టిక్యులర్‌గా కొన్ని షాట్స్‌లో అచ్చం చిరంజీవిగారిలా కన్పించాడు. సాయి అంతకు ముందు చేసిన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో పాటలు చాలా బాగుంటాయి. డ్యాన్స్‌లు ఇరగదీశాడు. శేఖర్‌, జానీ మాస్టర్స్‌ ఎంతో కష్టపడి రిహార్సల్స్‌ చేశారు. అందులోని బెస్ట్‌ మూవ్‌మెంట్స్‌ని సెలెక్ట్‌ చేసుకుని చేశాం’ అని చెప్పారు.