కాసేపటికే అంత రేటా?

Posted on : 08/02/2018 04:00:00 pm

సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రంటేనే అంత ఈజీగా ఒప్పుకొనే వాళ్ళు కదు కొంత కలం క్రితం కథానాయికలు. అలాంటిది సింగిల్ సాంగ్ అంటే అంతసీన్ లేదు దానికి, జైమాలిని, జ్యోతి లక్ష్మి, సిల్కు స్మిత ,ముమైత్ ఖాన్ ఇలా మరోరకం కేటగిరీ ఉండేది, తరం మారింది, తారలు కాస్త మెట్టు దిగారు కాసేపు కనబడితే చాలు అరకోటి పైనే రెమ్యూనరేషన్, మార్కెట్టును బట్టి రేటు ఇంకేముంది, ఐటమ్ సాంగ్ ప్లేస్ లో స్పెషల్ సాంగ్ వచ్చి చేరింది. ఇదంతా చెప్పడానికి అసలు కథ వేరే ఉంది.

హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే స్పెషల్‌ సాంగ్స్‌లో తళుక్కుమంటున్నారు తారలు. తమన్నా, కాజల్‌ లాంటి స్టార్ హీరోయిన్స్‌ కూడా స్పెషల్‌ సాంగ్‌తో అలరించారు. తాజాగా మరో అందాల భామ ఈ లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట.

సుకుమార్‌ సినిమాలో వచ్చే ఐటమ్‌ సాంగ్స్‌ కు స్పెషల్‌ క్రేజ్‌ ఉంటుంది. అది కూడా రామ్‌ చరణ్‌ లాంటి క్రేజీ స్టార్ సరసన డ్యాన్స్‌ చేసే ఛాన్స్ కావటంతో పూజ కూడా వెంటనే ఒప్పేసుకుందట. అయితే ఈ ఒక్క పాటకు పూజ భారీ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌ గా అందుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. జిల్‌ జిల్‌ జిగేల్‌ అంటే సాగే ఈ పాట కోసం పూజ ఏకంగా 50 లక్షల రూపాయల పారితోషికం అందుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరో ఈ వార్తలపై చిత్రయూనిట్‌ అధికారికంగా స్పందించకపోయినా.. క్రేజీ ఆఫర్స్‌తో ఫుల్‌ ఫాంలో ఉన్న పూజ హెగ్డేకు ఆ మాత్రం డిమాండ్‌ ఉంటుందంటున్నారు ఫ్యాన్స్‌. పైసా వసూల్ చేయాలంటే స్పెషల్ సాంగ్స్ కి ఒప్పుకోక తప్పుతుందా అనే వార్తలూ వినిపిస్తున్నాయి ఫిలింనగర్ జనాల నోటి వెంట.