హమ్యయ్య అందరూ సేఫ్

Posted on : 09/02/2018 11:42:00 am

దేశంలో ఓ పెను విమాన ప్రమాదం తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న 199మంది ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్ జెట్ విమానం ల్యాండ్‌ అయిన తర్వాత టైర్లు పేలడంతో రన్‌వేపై రాపిడి జరిగి ఫోటోలో ఉన్న ఆకారానికి వచ్చాయి. 199 మంది ప్రయాణికులతో గురువారం చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టైర్లను లిఫ్ట్‌ చేసే హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్య ఏర్పడటంతో, ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో మెయిన్‌ రన్ వే పాడవడంతోమూడు గంటలపాటూ మెయిన్‌ రన్‌వేను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.