మరీ అంత నోటి దురుసా

Posted on : 09/02/2018 06:44:00 pm

సోము వీర్రాజు ఏ అండ చూసుకొని ఇలా రెచ్చిపోతున్నారో తెలియదు గానీ చాలా టూ మచ్ చేస్తున్నాడనిపిస్తుంది తన న్యూస్ ఫాలో అయ్యే ఎవరికైనా సరే ఇప్పటివరకూ తేదేపాపై కయ్యానికి కాలుదువ్విన వీర్రాజు ఇప్పుడేమో జన సేనను టార్గెట్ చేస్తున్నట్లు కనబడుతోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని కేటీఆర్ కోదండరాం విషయంలో స్వాగతిస్తే ,పవన్ జేఏసీ విషయంలో డిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ తీసుకొని జేఏసీ కి కావాల్సిన సలహాలు సూచనలు తీసుకోవాలని జనసేనకు సూచించడం చూస్తుంటే ఎదుటి వారిని మానసికంగా దెబ్బకొట్టే స్టేటజీ బీజేపీ కనబరుస్తోందన్నది స్పష్టంగా కనబడుతోంది. ఇదే పవన్ కళ్యాణ్ మునుపటి ఎన్నికల్లో ఏపీలో కీలకంగా మారాడని భుజానకెత్తుకున్న బీజేపీ ఇప్పుడేమో ఇలాంటి చౌకబారు మాట్లాడుతోందని ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.

జేఏసీ ఏర్పాటుతో మేధావులను ఒక వేధికపైకి తెస్తానన్న పవన్ మాటలకు కౌంటర్ గా, ఏపీకి కేంద్రం ఎంత కేటాయించిందో జమాపద్దులు రాసుకోవాలని వీర్రాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ, చంద్రబాబులిద్దరూ ప్రజలను మభ్యపెట్టడంలో ఇద్దరూ ఇద్దరే అన్న పవన్ కళ్యాణ్ రాజకీయ పరిజ్ఞానం లేకనే మోదీ చంద్రబాబు లిద్దర్నీ నమ్మినట్లు చెప్పిన పవన్ కు కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా సోము వీర్రాజు లెక్క కట్టినట్లైంది. అందుకనే డిల్లీ వెళ్లి నేర్చుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చాడు ఇంతటితో ఆగినందుకు కచ్చితంగా పవన్ సంతోషించాల్సిందే. వీర్రాజు నోటి దురుసు చూస్తుంటే పార్టీ నడిపించడం నీకెలాగూ చేతకాదుగానీ మా దగ్గర అప్రెంటిస్ గా చేరు ఆ అనుభవంతో జనసేన పార్టీ తో సహా జేఏసి ను కూడా నడిపించు కోవచ్చు అని అనే బాపతే అనిపిస్తోంది వీర్రాజు తీరు చూస్తుంటే.