సూటిప్రశ్నలతో ఉతికారేసింది

Posted on : 09/02/2018 07:03:00 pm

హైదరాబాద్‌: ఈ సారి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వంతొచ్చింది, బడ్జెట్ అనంతరం ఇంటా బయటా మోదీ సర్కార్ పై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలంటే అంత చులకనా? హామీలిచ్చినప్పుడు వాటిని నెరవేర్చడానికేమైందని? రాజ్యసభలో ఉతికారేసింది ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి, ప్రత్యేక హోదా ఇచ్చేందకు మీకెందుకంత కష్టం అనే వరుస ప్రశ్నలను సంధించారు. అసలే తనకు జరిగిన అవమానం పట్ల తెగ రగిలి పోతోన్న ఆమె ఈ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు.

కేంద్ర బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, రుణమాఫీకి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే రైతులు గుర్తుకొచ్చారా? రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి ఏం తెలుసని నిలదీశారు. కౌలు రైతులకు పైసా కేటాయించలేదని వెల్లడించారు. పార్లమెంట్‌లో మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో చూస్తున్నామని, ఇక మహిళా రైతుల గురించి ఏం మాట్లాడతామని నిర్వేదం వ్యక్తం చేశారు. రేణుకను బీజేపీ నాయకులు ‘శూర్పణక’తో పోల్చిన సంగతి తెలిసిందే.