అమరావతిలో మెట్రోలేదు గిట్రో లేదు

Posted on : 09/02/2018 08:48:00 pm

నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి పట్టణంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొస్తున్న చంద్రబాబు మాటలు కేవలం కట్టు కథలేనన్న వాస్తవాన్ని బబయటపెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతిలో మెట్రో, లైట్ మెట్రో ప్రతిపాదనల విషమై ఆరాతీసిన విజయసాయిరెడ్డికి ఆప్రాజెక్టు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు తమదగ్గరలేవని కేంద్రం తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వచ్చినట్లైంది. దీంతో అమరావతిలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఒట్టి హంబక్ అని తేలిపోయింది.

అమరావతిలో మెట్రో రైలు - లైట్ మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద ఎటువంటి ప్రతిపాదన లేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఆ విషయంపై కేంద్రం స్పష్టతనివ్వడంతో టీడీపీ డ్రామా బట్టబయలైంది. మెట్రో రైలు రాలేదంటూ టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేయడం హాస్యాస్పదం. ప్రతిపాదనలే లేకుండా కేంద్రం ప్రాజెక్టును ఎలా మంజూరు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రధానమంత్రి మాతృ వందనం పథకం(పీఎంవీవై) అమలుపై విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో దాని అమలు నామమాత్రంగా ఉన్నట్టు కేంద్ర మహిళ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా మహారాష్ట్రలో అత్యధికంగా 50831 మంది గర్భిణిలు -బాలింతలైన తల్లులు లబ్ది పొందారు. జార్ఖండ్ - ఛత్తీస్ ఘఢ్ ల కన్నా తక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 2352 మంది మాత్రమే లబ్ది పొందారు. గర్భిణిలు - బాలింతల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ. 5 వేలు అందజేస్తుంది.