మెహబూబా టీజర్ ఆదరహో

Posted on : 10/02/2018 12:09:00 am

సరిగ్గా సంవత్సరం క్రితం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించ దగ్గ సినిమా తీసి అబ్బురపరిచారు సంకల్ప్ రెడ్డి. అవునండీ నేను చెప్తోంది ఘాజి గురించే. అప్పటి నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా దానికి తగ్గ సినిమా రాకపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చు, కానీ ఈరోజు రిలీజ్ అయిన మెహబూబా టీజర్ చూసాక, కొత్తదనాన్ని, టెక్నికల్ వాల్యూస్ ని కోరుకునే మనందరి దాహాన్ని ఈ సినిమా తీరుస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు.

టీజర్ ఫస్ట్ షాట్ లోనే అట్టారి బోర్డర్ గేట్స్ ఓపెన్ చేస్తున్న సన్నివేశం చూపించారు, అది ఎంతో అద్భుతం గా ఉంది. లాంగ్ షాట్ లో ఎరుపెక్కిన ఆకాశాన్ని కూడా కవర్ చేసారు.

సెకండ్ షాట్ లో ఆర్మీ వెళ్తుండగా హెలికాప్టర్స్ వారిని అనుసరిస్తూ వెళ్లడం చూపించారు, 1971 యుద్ధం లో టీజర్ లో చూపించిన హెలికాప్టర్స్ ని వాడకపోయినా, దర్శకుడు కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకునుండొచ్చు, డీటెయిల్స్ ఎలా ఉన్న, ఆ షాట్ మాత్రం చాల అద్భుతం గా వచ్చింది.

తర్వాత వచ్చిన యుద్ధ విమానాల బాంబింగ్ సన్నివేశం చాల అతేంటిక్ గా ఉంది. బాక్గ్రౌండ్ హమ్మింగ్ తో కూడిన పాట కొంచెం హాంటింగ్ గాను, ఎక్కువ రొమాంటిక్ గాను ఉంది.

హీరో, హీరోయిన్లు బ్రిడ్జి మీద పరిగెడుతున్న సన్నివేశం చూస్తున్నప్పుడు మణిరత్నం తీసిన దిల్ సే సినిమా మన జ్ఞాపకాల్లో మెదుల్తుంది .

క్లిఫ్ మీద హీరో హీరోయిన్ల సన్నివేశం, యుద్ధ విమానాలు వెళ్తున్న చివరి సన్నివేశం ఈ సినిమా ఒక మోస్ట్ ప్రామిసింగ్, టెక్నీకెల్లి హై స్టాండర్డ్ టేల్ అవుతుంది అని డిఫైన్ చేసేశాయి.