తమన్నాకు చేదు అనుభవం

Posted on : 10/02/2018 01:03:00 am

తమన్నాకు ఈ మధ్య ఒక చేదు అనుభవం ఎదురైంది. ఓ షోరూమ్‌ ఓపెనింగ్‌కు వెళ్లిన తమన్నాపై ఓ ఆకతాయి చెప్పు విసిరిన విషయం తెలిసే ఉంటుంది. అది ఆమెకు కొంచెం దూరంలో పడింది.

‘అలా రియాక్ట్‌ అయినవాళ్లను ఏమీ చేయలేం. మేం యాక్టర్స్, మా మీద ప్రేమతో వేసే పువ్వులను, ద్వేషంతో విసిరే రాళ్లను ఒకేలా స్వీకరించాలి' అని పేర్కొన్నారు తమన్నా. అయితే చెప్పు ఎందుకు విసిరావ్ అని అడిగితే ‘తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. తను ఈ మధ్య సినిమాలు చేయటం తగ్గించేశారు. ఆవిడను కలుద్దాం అంటే బౌన్సర్స్‌ ఆమె దగ్గరకు వెళ్లనీకుండా చేశారు. ఆ కోపంతో ఆమె వైపు షూ విసిరేశాను' అని పేర్కొన్నాడు ఆ ఆకతాయి.