రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Posted on : 10/02/2018 08:58:00 am

శ్రీనగర్: ఎటువైపు నుంచి ఏ ఉగ్రదాడి జరుగుతుందోనని అనుక్షణం భయపడే జమ్మూ కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపుపై దాడి చేశారు. సుంజ్వాన్ ప్రాంతంలో తెల్లవారు జామున జరిగిన ఈ దాడిలో ఆర్మీ జవానుతో పాటు ఆయన కుమార్తె తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
జైషే మొహమ్మద్‌కు చెందిన సుమారు ముగ్గురు ఉగ్రవాదులు జేసీఓ ఫ్యామిలీ హెడ్‌క్వార్టర్స్‌లోకి చొరబడి కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టి ఎదురుకాల్పులు జరుపుతున్నాయి. ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు డ్రోన్‌లు, హెలికాప్టర్లను హుటాహుటిన రంగంలోకి దింపారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ క్యాంపు సమీపంలోని స్కూళ్లను మూసివేయాల్సిందిగా ఆధికారులు ఆదేశాలు జారీ చేశారు. శనివారం అఫ్జల్ గురు వర్ధంతి సందర్భంగా జైషే ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఉగ్రదాడులు చోటుచేసుకోవడం విశేషం.